Header Banner

వైసీపీకి మరో షాక్.. పోసానికి 14 రోజుల రిమాండ్! వైకాపాలో టెన్షన్ టెన్షన్.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు!

  Wed Mar 05, 2025 09:49        Politics

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి కర్నూలు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా ఆదోని మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఇలాంటి కేసులోనే అరెస్టై గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతినివ్వడంతో పోసానిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం కర్నూలుకు తరలించారు. అక్కడ న్యాయమూర్తి ఎదుట పోసానిని ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదనల అనంతరం పోసానికి న్యాయమూర్తి ఈ నెల 18 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు, నరసరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్ విధించింది. పోసానిపై రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదయ్యాయి.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

 

వైజాగ్ ప్రజలు ఆందోళన.. ఏన్నో యేళ్ల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా.?

 

తల్లికి వందనంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి లోకేశ్‌! 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి!

 

రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం! ఇద్దరు మృతి, 10 మంది...

 

గుడ్ న్యూస్.. ఒకప్పటి సంచలన పథకం తిరిగి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు! ఇకపై వారికి సంబరాలే..

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్.. విడదల రజనికి బిగుస్తున్న ఉచ్చు! ఇక జైల్లోనే..?

 

వైసీపీ కి మరో షాక్.. వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు! ఎప్పటివరకంటే?

 

తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రయాణం! ఎలక్ట్రిక్ రైళ్లతో భారత్ ముందడుగు!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #PosaniKrishnaMurali #Actor #Tollywood